క్షణక్షణం ఉత్కంఠ.. ఇరు జట్లు కబడ్డీ(Kabaddi)లో తోపులు.. పాయింట్ పాయింట్‌కి టెన్షన్ టెన్షన్. స్కోర్లు సమం అవుతూ సాగిన ఫైనల్.. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ ఇరాన్(India vs Iran) మ్యాచ్ సాగిన తీరు క్రీడా ప్రేమికులకు అసలు సిసలైన మజాను ఇచ్చింది. కబడ్డీ ఫీల్డ్‌పైనే ధర్నా చేసిన పరిస్థితి కనిపించింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఫీల్డ్‌లో నిరసన వ్యక్తం చేయడంతో గంటకు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. అంపైర్లు నిర్ణయంతో ఇండియా, ఇరాన్ ప్లేయర్లు ఆందోళనకు దిగారు. చివరికు ఫలితం ఇండియాకు అనుకూలంగానే వచ్చింది. తర్వాత ఒక టాకిల్, మరో రైడ్‌తో ఇండియా గెలిచింది.
పూర్తిగా చదవండి..Asian Games 2023: కబడ్డీ ఫైనల్లో ధర్నా, డ్రామా.. గంటపాటు ఇండియా, ఇరాన్ ఆటగాళ్ల నిరసన!
ఏషియన్ గేమ్స్‌లో భాగంగా ఇరాన్-ఇండియా మధ్య జరిగిన కబడ్డీ ఫైనల్ మ్యాచ్ హైడ్రామాకు వేదికైంది. మ్యాచ్ మరో 65 సెకన్లలో ముగుస్తుందనగా.. ఇరు జట్ల ఆటగాళ్లు కబడ్డీ మ్యాట్‌పైనే ధర్నాకు దిగారు. పాయింట్ల విషయంలో ఇరు జట్ల ఆటగాళ్లు అంపైర్‌తో వాదించగా.. దాదాపు గంటన్నర మ్యాచ్ నిలిపివేత తర్వాత నిర్ణయం ఇండియాకు ఫేవర్‌గా వచ్చింది. తర్వాత ఓ టాకిల్, ఓ సక్సెస్ఫుల్ రైడ్‌తో ఇండియా 33-29తేడాతో గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

Translate this News:











