Gautam Gambhir criticizes team india and pakistan: 2011 వరల్డ్ కప్ ఫైనల్ హీరో, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(Gautham gambhir) ఏం మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడుతాడు. ఎవరు ఏం అనుకున్నా నలుగురు తిట్టుకున్నా ముగ్గురు మెచ్చుకున్నా అదంతా అతనికి అనవసరం. చెప్పాలనుకున్నది చెప్పేస్తాడంతే. ఈ నైజం వల్ల గంభీర్‌ని సోషల్‌మీడియాలో ట్రోల్ చేసేవారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కోహ్లీ అభిమానులకు గంభీర్ అంటే కోపం. అతను ఏం మాట్లాడినా అందులో కోహ్లీనే టార్గెట్ చేసేలాగా ఉంటుందన్నది వాళ్ల వాదన. ఇక ప్రస్తుతం ఆసియా కప్ టోర్ని జరుగుతుండగా.. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ ఆడింది ఇండియా. పాకిస్థాన్‌పై జరిగిన ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో మైదానం లోపల టీమిండియా-పాక్ ఆటగాళ్లు చాలా ఫ్రెండ్లీగా కనిపించారు. దీన్ని గంభీర్ తప్పుపట్టాడు.
గంభీర్ ఏం అన్నాడంటే:
‘జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నప్పుడు మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ప్రత్యర్థి ఆటగాళ్లతో స్నేహాన్ని మైదానం బయటే వదిలేయాలి. ఆ తర్వాతే గ్రౌండ్లో అడుగుపెట్టాలి. ఇరు జట్ల ఆటగాళ్ల కళ్లలో దూకుడు ఉండాలి. 6-7 గంటల క్రికెట్ తర్వాత మీరు కోరుకున్నంత ఫ్రెండ్లీగా ఉండొచ్చు’ అని గంభీర్ వ్యాఖ్యలు చేశాడు.
Asia Cup: మీ ఫ్రెండ్షిప్ బౌండరీ రోప్ బయట చూపించుకోండి.. గంభీర్ చురకలు!
మ్యాచ్ సమయంలో ప్రత్యర్థులతో ఫ్రెండ్లీగా ఉండడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ఆసియా కప్‌లో భాగంగా ఇటీవల జరిగిన మ్యాచ్‌లో భారత్- పాక్ ఆటగాళ్ల మధ్య జరిగిన సరదా క్షణాలపై గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉండొచ్చని.. గేమ్ జరుగుతున్న సమయంలో సీరియస్‌నెస్ ముఖ్యమని అభిప్రాయపడ్డాడు.

Translate this News:











