ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial intelligence)ని ఎక్కువగా యూజ్ చేసుకుంటోంది యువత. అటు స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులు తమ హోం వర్క్స్, ప్రాజెక్టుల కోసం ఏఐ(AI)ని ఉపయోగించుకుంటోంది. మరోవైపు లవర్ లేకుండా సింగిల్‌గా బతుకుతున్న అబ్బాయిలు ఈ మధ్య కాలంలో ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ ట్రేండ్ ఇండియాలో కూడా కొనసాగుతోంది. అదేంటి ఏఐ ఏంటని ఆలోచిస్తున్నారా? కొంతమందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఏఐ గర్ల్‌ఫ్రెండ్ అంటే ఓ ప్రీ డిజైనెడ్ మెషీన్ లవర్. అంటే మనకి నచ్చిన క్వాలిటీలను సెట్ చేసుకోని ఏఐ ద్వారా ఓ కృత్రిమ లవర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ లవర్‌తో రోజూ మాట్లాడుకోవచ్చు. మనకి నచ్చినట్టు ఉండొచ్చు.
పూర్తిగా చదవండి..AI girlfriend: ఏఐ గర్ల్‌ఫ్రెండ్ ఉందని ఆనందపడొద్దు బ్రదర్.. ముందుముందు ముసళ్ల పండుగే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లవర్స్‌తో ప్రేమలో మునిగిపోయి ఉన్నవారికి ఇదే హెచ్చరిక. ఎక్కువగా డిజిటల్ లవర్స్‌తో ఇంటరెక్ట్ అవ్వకండి. ఎందుకంటే మెషీన్‌తో ఉండే ప్రేమకి మనుషులతో చేసే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. మెషీన్ లవర్ మనం చెప్పినట్టు వింటుంది. రియల్ లైఫ్‌లో అడ్జెస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఓలిన్ బిజినెస్ స్కూల్లో డేటా సైన్స్ ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లిబర్టీ విట్టర్ట్ అంటున్నారు.

Translate this News:











