గుంటూరులో డెల్టా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలంటూ టీడీపీ నేతలు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. కృష్ణ డెల్టా రైతాంగం నారుమళ్లు అయిపోయి నీరు కోసం ఎదురుచూడటం దారుణమన్నారు. ఏ నీరు ఎప్పుడు వాడాలో కూడా కనీస పరిజ్ఞానం లేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఫైర్ అయ్యారు. ఏదన్నా సమస్యపై మంత్రులు మాట్లాడమంటే బూతులు తప్ప ఏమి మాట్లాడారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 5 లక్షల70వేల ఎకరాలు సాగులోకి ఉన్నాయన్నారు. ఇరిగేషన్ కోసం ఏమి చేశారు..? అంటే మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు ఇళ్ల వెంట తిరగటం కాదు రైతు దగ్గరకు పొలాల వెంట తిరగాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..AP News: రైతుల కోసం కదం తొక్కిన టీడీపీ నేతలు.. పట్టిసీమకు తాళం వేశారని ఫైర్.. వివరాలివే!
గుంటూరులో డెల్టా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలంటూ టీడీపీ నేతలు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. కృష్ణ డెల్టా రైతాంగం నారుమళ్లు అయిపోయి నీరు కోసం ఎదురుచూడటం దారుణమన్నారు.

Translate this News:











