టీడీపీ – జనసేన పొత్తుపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (TDP Leader Ayyanna Patrudu) సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక కల్యాణం కోసం అవసరం అయితే తన సీటు కూడా జనసేనకు ఇవ్వాలని చంద్రబాబుకు (Chandrababu Naidu) సూచించినట్లు చెప్పారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే తాను అనేక సార్లు ఎమ్మెల్యేగా పని చేశానన్నారు. తనకు పదవులపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ను (AP CM Jagan) గద్దె దించడమే తన లక్ష్యమన్నారు. ఇందుకోసం తాను ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధమని అయ్యన్న స్పష్టం చేశారు. పోలీసులు తాము తినే ప్రతీ పైసా.. ప్రజల సొమ్ము అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జైలుకు వెళ్లడానికి తాను కూడా నేను సిద్ధమని స్పష్టం చేశారు. అందరి బలం కూడగట్టి ఈ దుర్మార్గుడిని రాజకీయ సమాధి చేయాలని సీఎం జగన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు అయ్యన్న. ఇంకా నారా చంద్రబాబును అరెస్ట్ చేసినట్లే లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. లోకేష్ ను అరెస్ట్ చేస్తే బ్రాహ్మణి నాయకత్వంలో పార్టీ నడుస్తుందన్నారు.
పూర్తిగా చదవండి..AP Politics: నా సీటు జనసేనకు ఇవ్వండి.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వాఖ్యలు

Translate this News:











