AP SKILL DEVELOPMENT SCAM CASE HEARING IN SUPREME COURT: ఇవాళ(అక్టోబర్ 3) సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu naidu) పిటిషన్పై విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది. జాబితాలో చిట్టచివరి కేసు(63వ నెంబర్)గా చంద్రబాబు కేసు ఉంది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు(supreme court)ను ఆశ్రయించారు చంద్రబాబు. గతవారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు విచారణకు వచ్చింది.అయితే విచారణ నుంచి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి తప్పుకున్నారు. అదే రోజు CJI ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపు లాయర్ల ప్రస్తావన వచ్చింది.మరో బెంచ్ కేటాయించి విచారణ చేపడతామన్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Chandrababu case: నేడు సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్పై విచారణ.. ఏం జరగబోతోంది?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు దారితీసిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై తమ అభిప్రాయాన్ని వినాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ కేసు ఇవాళ(అక్టోబర్ 3) విచారణకు రానుంది.

Translate this News:











