చంద్రబాబు కేసు విచారణతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు(justice hima bindu)కు భద్రత పెంచింది. 4+1 ఎస్కార్ట్ కల్పించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎలాంటి భద్రత లేదు. కోర్టుకు వచ్చి, వెళ్లే సమయంలో నిఘా పెట్టారు పోలీసులు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్ట్‌పై.. ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబు నాయుడును గ్రాండ్ హౌస్ రిమాండ్ చేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు శ్రీరాములు, పూనవోలు ప్రభాకర్‌లు తమ వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఇరు వర్గాల వాదనను విన్నారు.
ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు చంద్రబాబు తరపు న్యాయవాదులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిఐడి కార్యాలయంలో ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలించేందుకు అనుమతించాలని సిఆర్పిసి సెక్షన్ 207 కింద సిద్ధార్థ్ లూథ్రా బృందం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ దాఖలు చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది బృందం తమ వాదనను వినిపించేందుకు ప్రయత్నించగా, న్యాయమూర్తి దీనిపై సీరియస్ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ పిటిషన్లు దాఖలు చేసి వెంటనే వాదనలు ప్రారంభించడంపై చంద్రబాబు తరపు న్యాయవాదులపై జస్టిస్ హిమబిందు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Justice Himabindu: జడ్జి హిమబిందుకి ముప్పు ఉందా? భద్రత పెంపు..!
చంద్రబాబు కేసు విచారణతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందుకు భద్రత పెంచింది. 4+1 ఎస్కార్ట్ కల్పించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎలాంటి భద్రత లేదు. కోర్టుకు వచ్చి, వెళ్లే సమయంలో నిఘా పెట్టారు పోలీసులు.

Translate this News:











