Chandrababu Skill Development Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. దసరా సెలవుల తర్వాత విచారణ చేస్తామని చెప్పింది. దీంతో దసర సెలవులు ముగిసేవరకు చంద్రబాబు జైల్లోనే ఉండనున్నారు. అటు చంద్రబాబు బెయిల్ పిటిషన్, ఐఏ అప్లికేషన్ వెకేషన్ బెంచ్‌కు పోస్ట్ చేయాల్సిందిగా చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. దీనికి హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికను వెకేషన్ బెంచ్‌కు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్ తో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చింది హైకోర్టు.
పూర్తిగా చదవండి..Skill Development Case: చంద్రబాబుకు షాక్.. దసరా ముగిసేవరకు జైల్లోనే..!
హైకోర్టులో చంద్రబాబుకు షాక్ తగిలింది. తనకు బెయిల్ కావాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసంది. దసర సెలవుల తర్వాత కోర్టు విచారించనుండగా.. అప్పటివరకు చంద్రబాబు జైల్లోనే ఉండాలి. ఆ తర్వాత విచారణలోనైనా చంద్రబాబుకు బెయిల్ రావాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Translate this News:











