ఏపీ రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినట్టు ప్రకటించడం… టీడీపీతో కలిసి మెలసి తిరుగుతుండడం.. అటు జగన్ ఢిల్లీ పెద్దలతో భేటీ అవుతుండడం లాంటి పరిణామాలు ఊహించని విధంగా తక్కువ టైమ్లో జరిగిపోయాయి. ఇదే సమయంలో వారాహి యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. జగన్పై ఉన్న కేసులు ఎత్తివేస్తే.. కేంద్రంతో వారికి సత్సంబంధాలు ఉన్నట్లు భావించాలంటూ పవన్ హాట్ కామెంట్స్ చేశారు. ఓవైపు చంద్రబాబుపై ఒక కేసు తర్వాత మరొ కేసు ఫైల్ అవుతుండగా.. మరోవైపు జగన్ కేసులు ఎత్తివేస్తే అంటూ పవన్ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటన్నదానిపై సర్వత్రా చర్చ జరగుతోంది.
పూర్తిగా చదవండి..Pawan vs Jagan: జగన్పై ఉన్న కేసులు ఎత్తివేస్తారా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
సొంత బాబాయిని హత్య చేస్తే హార్ట్ ఎటాక్ అని ప్రచారం చేసిన వ్యక్తి జగన్ అంటూ సీఎంపై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. చంద్రబాబునాయుడు అవినీతి చేశారని చెప్పడం ఆరోపణ మాత్రమేనని.. రాజకీయ అంశాలలో సినిమా ఇండస్ట్రీ స్పందిస్తే వారిని టార్గెట్ చేస్తారన్నారు. జగన్పై కేసులు ఎత్తివేస్తే కేంద్రంతో వైసీపీకి మంచి సంబంధాలే ఉన్నాయని భావించాల్సి వస్తుందన్నారు పవన్.

Translate this News:











