ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి రోజా మరో సారి తీవ్ర వాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిది అక్రమ అరెస్టు అని నిరూపించుకోలేని స్థితిలో టిడిపి ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై సమాధానం చెప్పలేక బాయ్ కాట్ పేరుతో టీడీపీ నేతలు వెనుతిరిగారని ఎద్దేవా చేశారు రోజా. లోకేష్ ట్వీట్ పై సైతం రోజా స్పందించారు. లోకేష్ ధనదాహంతోనే చంద్రబాబు అవినీతి బాట పట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంగా ప్రజాభివృద్ధి పక్కనపెట్టి అవినీతి అజెండాగా పరిపాలన సాగించిన వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైసీపీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Minister Roja: లోకేష్ ధనదాహంతోనే చంద్రబాబు అవినీతి.. మంత్రి రోజా సంచలన వాఖ్యలు..

Translate this News:











