ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ నియామకాలకు (AP SI Recruitment) సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు (AP High Court) గురువారం విచారణ నిర్వహించింది. పిటిషన్ల తరఫు న్యాయవాది జడ శ్రవణ్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా 56 వేల మంది దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారని కోర్టుకు తెలిపారు. వారిలో నిబంధనల మేరకు ఎత్తు లేరన్న కారణంతో 5 వేల మందిని తిరస్కరించారని న్యాయస్థానానికి విన్నవించారు. అయితే.. ఈ నియామకాల సందర్భంగా రిజెక్ట్ అయిన అభ్యర్థులందరూ 2019లో క్వాలిఫై అయ్యారని వివరించారు. దీంతో స్పందించిన న్యాయస్థానం.. 2019లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడెందుకు తిరస్కరణకు గురయ్యారని ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి బొత్స శుభవార్త.. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
SI Jobs: ఎస్ఐ నియమకాలపై హైకోర్టులో విచారణ.. అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
ఏపీలో ఎస్ఐ నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రభుత్వం నిబంధనలు పాటించని కారణంగా అనేక మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పరీక్షలను తత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. అయితే.. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.

Translate this News:











