ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు (AP High Court) 3వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు మధ్యాహ్నం వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఈ పిటిషన్ కు సంబంధించిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుతు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. లింగమనేనికి రింగ్ రోడ్ మార్గంలో భారీగా భూములు ఉన్నాయని శ్రీరామ్ తన వాదనలో తెఇపారు. ఈ నేపథ్యంలో లింగమనేని భూముల పక్క నుంచే వెళ్లేలా రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పులు చేసినట్లు కోర్టుకు తెలిపారు ఏజీ. లింగమనేని ఎకరం రూ.10 లక్షలకు కొంటే మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత దాని ధర రూ.35 లక్షలకు చేదని ఏజీ వాదనలు వినిపించారు.
Chandrabau Bail: చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా!
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు 3వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు మధ్యాహ్నం వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.

Translate this News:











