చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయనను సమర్ధిస్తున్న ఏపీ హైకోర్టు న్యాయవాదులు. ఆర్డర్ కాపీ రెడీ అవుతోందని…ఈరోజు సాయంత్రానికి బయటకు వచ్చేస్తారని చెప్పారు. ఒకవేళ ఆర్డర్ కాపీ జైలుకు చేరడం లేటు అయితే రేపు ఉదయం ఆరు గంటల కల్లా వస్తారని స్పష్టం చేశారు. ఇక మీదట చంద్రబాబు మీద ఉన్న అన్ని కేసుల్లో ఆయనకు రిలీఫ్ దొరుకుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. చంద్రబాబుగారు దేనిలోనూ తప్పు చేయలేదు. ఆల్రెడీ కొన్ని కేసుల్లో బెయిల్ ఉంది. సుప్రీంకోర్టులో కూడా బెయిల్ వచ్చేస్తుంది. ఏది చేసినా న్యాయపరంగా వెళ్ళారని అంటున్నారు లాయర్లు. ఈ కేసులు కేవలం ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి మాత్రమే పెట్టారు. ఇవేవీ నిలబడవు. ఆయనను ఇబ్బంది పెట్టడానికే ఇదంతా చేశారని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..AP high court lawyer:చంద్రబాబు విడుదల ఎప్పుడంటే.. సంచలన విషయాలు చెప్పిన లాయర్
న్యాయం గెలిచిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు తరుపు ఏపీ హైకోర్టు లాయర్లు. తాత్కాలికంగా బాబును బంధించగలిగారు కానీ ఎక్కువరోజులు ఉంచలేరని చెప్పారు. కడిగిన ముత్యంలా బాబు బయటకు వస్తారని అన్నారు. ఈరోజు సాయంత్రానికల్లా ఆయన బయటకు వచ్చేస్తారు. లేకపోతే రేపు పొద్దున ఆరులోపు మాత్రం కచ్చితంగా వచ్చేస్తారని చెప్పారు.

Translate this News:











