అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని లోకేష్ ను ఆదేశించింది. లోకేష్ కు 41 ఏ నోటీస్ ఇవ్వమని అధికారులను ఆదేశించింది. 41 ఏ నోటీసు ఇస్తామని కోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని ఏజీ శ్రీరామ్ వివరించారు. దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని లోకేష్ కు చెప్పాలని అని కోరారు. ఈ నేపథ్యంలో విచారణకు సహకరించాలని లోకేష్ ను హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఏపీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీ బయలుదేరారు. విచారణకు రావాల్సిందిగా ఆయనకు 41A కింద నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్, కేసుల విషయంలో ఆయన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.
పూర్తిగా చదవండి..Nara Lokesh: నారా లోకేష్ కు హైకోర్టు బిగ్ షాక్.. అరెస్ట్ ఖాయం?
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని లోకేష్ ను ఆదేశించింది. లోకేష్ కు 41 ఏ నోటీస్ ఇవ్వమని అధికారులను ఆదేశించింది.

Translate this News:











