ఏపీలో నిరుద్యోగుల పంట పండనుంది. యూనివర్శిటీల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. దీంతో వేలమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,282 పోస్టుల భర్తీకి అక్టోబరు 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వీటితో పాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్‌పై తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
పూర్తిగా చదవండి..AP government jobs:ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్-3,282 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,282 పోస్టుల భర్తీకి అక్టోబరు 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

Translate this News:











