మాజీ మంత్రి నారాయణకు (AP Ex Minister Narayana) ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రాజధాని అమరావతి అసైన్ భూముల కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ను పొడిగించింది ఏపీ హైకోర్టు (AP High Court). మాజీ మంత్రి నారాయణతో పాటుగా మరి కొంత మంది భూములను కొనుగోలు చేసిన వారికి సంబంధించి కూడా బెయిల్ ఈ రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా తమకు మరికొత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో కేసు విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం. అయితే మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన మరో నాలుగు బెయిల్ పిటిషన్లను హైకోర్టు వాయిదా వేసింది. ఆ పిటిషన్ల విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో (AP Inner Ring Road Case) బెయిల్, క్వాష్ పిటిషన్ వాయిదా పడ్డాయి. అసైన్ ల్యాండ్స్ కేసులో క్వాష్, బెయిల్ పిటిషన్లను సైతం వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
ఇది కూడా చదవండి: Chandrababu Updates: చంద్రబాబుతో ములాఖత్.. బాబు ఆరోగ్యంపై చినరాజప్ప కీలక ప్రకటన..
AP High Court: మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట
మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రాజధాని అమరావతి అసైన్ భూముల కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ను మరో రెండు వారాలు పొడిగించింది ఏపీ హైకోర్టు. నారాయణ దాఖలు చేసిన మరో నాలుగు బెయిల్ పిటిషన్లను హైకోర్టు వాయిదా వేసింది. ఆ పిటిషన్ల విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్, క్వాష్ పిటిషన్ వాయిదా పడ్డాయి. అసైన్ ల్యాండ్స్ కేసులో క్వాష్, బెయిల్ పిటిషన్లను సైతం వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

Translate this News:











