David Sawang: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్‌లో రెండు గ్రూప్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడు ఉండటంతో ఇప్పుడు ఆ వార్త వైరల్‌గా మారుతోంది. ఏపీ మాజీ డీజీపీ, ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ కొడుకు హైదరాబాద్‌లో వీరంగం చేశాడని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని జీరో పబ్ దగ్గర అర్థరాత్రి హంగామా జరిగింది. ఆ పబ్‌కు వెళ్లిన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ఫుల్లుగా మద్యం సేవించి గొడవ పడ్డారని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..David Sawang: నాన్న మాజీ డీజీపీ కొడుకు రౌడీనా..!?
ఆంధ్ర ప్రదేశ్ మాజీ డీజీపీ ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ కొడుకు రెచ్చిపోయి ప్రవర్తించాడు. విచక్షణ రహితంగా మరోక యువకుడిని చితకబాదాడు డేవిడ్ సవాంగ్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఇదంతా ఓ యువతి విషయంలో జరిగిందని సమాచారం.

Translate this News:











