Chandrababu IRR Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో (IRR Case) చంద్రబాబుకు (Chandrababu) హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు (AP High Court) ఆదేశాలు జారీ చేసింది. అంగళ్లు కేసులో రేపటికి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్ఆర్ పీటీ వారెంట్ పై సోమవారం వరకు స్టే ఇచ్చింది హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పీటీ వారెంట్, కస్డడీపై సోమవారం వరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా అంగళ్లు కేసులో రేపటి వరకు పీటీ వారెంట్ వేయబోమని ప్రభుత్వ తరఫు లాయర్ హైకోర్టుకు తెలిపారు. రేపు హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరగనుంది.
ఇది కూడా చదవండి: Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?
Big Breaking: చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట.. అప్పటివరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు!
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అంగళ్లు కేసులో రేపటికి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Translate this News:











