ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇల్లు నిర్మించిస్తుంటే.. చంద్రబాబు కోర్టులో కేసులు వేసి ఆపే ప్రయత్నం చేశారని సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు (Chandrababu Naidu) ఇల్లు కూడా కట్టుకోలేదన్నారు. చంద్రబాబు ఒక నెలరోజుల పాటు ఎప్పుడైనా ఏపీలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు జగన్. ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పెద్దాపురంలో ఈ రోజు సామూహిక గృహప్రవేశాలను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 22 లక్షల గృహాల నిర్మాణం జరుగుతోందన్నారు. 17వేల వైయస్సార్ జగనన్న కాలనీలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే 7:43 లక్షల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ఆయన రాష్ట్రంలో ఉండరు.. ఆయన దత్త పుత్రుడు కూడా రాష్ట్రంలో ఉండరంటూ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: AP News: అమిత్‌షాను లోకేష్ కలిసింది అందుకే.. అచ్చెన్నాయుడు సంచలన వాఖ్యలు
CM Jagan: పవన్ ప్యాకేజీ స్టార్.. చంద్రబాబుకు ఏపీలో ఇల్లే లేదు: సీఎం జగన్ విమర్శల వర్షం
చంద్రబాబుకు ఏపీలో ఇల్లు కూడా లేదని ఏపీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఆయన నెల రోజుల పాటూ ఎప్పుడు రాష్ట్రంలో లేడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ రోజు పెద్దాపురంలో జరిగిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ఈ వాఖ్యలు చేశారు.

Translate this News:











