ఈ రోజు విశాఖలో ఇన్ఫోసిస్ ను (Vizag Infosys) ప్రారంభించనున్నారు ఏపీ సీఎం జగన్ (AP CM Jagan). ఈ రోజు ఆయన విశాఖ, అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:20 కి విశాఖ ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ చేరుకుంటారు. 10:40 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ ద్వారా ఋషికొండ వద్ద ఉన్న ఐటీ హిల్స్ లోని హిల్ నెంబర్ 3 కి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో హిల్ నెంబర్ 2కి చేరుకుని ఇన్ఫోసిస్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్, ఐటీ ఉద్యోగులతో జగన్ సమావేశం అవుతారు. తర్వాత హెలిప్యాడ్ వద్ద జీవీఎంసీ బీచ్ క్లీనింగ్ మిషన్లను జగన్ ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: AP Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి..!
Vizag Infosys: విశాఖలో ఇన్ఫోసిస్.. నేడు ప్రారంభించనున్న జగన్.. వివరాలివే!
విశాఖ, అనకాపల్లిలో ఈరోజు ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ను సీఎం ప్రారంభించనున్నారు. అచ్యుతాపురంలో లారెస్ లాబ్ యూనిట్ 2 ను సైతం సీఎం ప్రారంభిస్తారు.

Translate this News:











