Jagan delhi tour: సీఎం జగన్(Jagan) ఢిల్లీ టూర్లో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర పెద్దలతో వరుస పెట్టి భేటీ అవుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala sitharaman)తో సీఎం జగన్ ఇప్పటికే ముగిసింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం(Polavaram) నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి(Mithun reddy), సీఎస్ జవహర్‌రెడ్డి ఉన్నారు. ఇక నిర్మలాతో మీటింగ్ తర్వాత సీఎం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కలిశారు. ఇక రేపు(అక్టోబర్ 6) వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో పాల్గొననున్నారు జగన్. రేపు(అక్టోబర్ 5) రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.
పూర్తిగా చదవండి..Jagan Delhi tour: జగన్ ఢిల్లీ ముచ్చట.. కేంద్ర పెద్దలతో సీఎం భేటీ వెనుక ఆంతర్యం ఏంటి?
రాష్ట్ర విభజన, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సాయం సహా పెండింగ్ లో ఉన్న సమస్యలపై కేంద్ర పెద్దలతో చర్చించేందుకే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో సీఎం ఇప్పటికే భేటీ అవ్వగా రేపు అమిత్‌షాను కలవనున్నారు జగన్.

Translate this News:













