CM Jagan Meeting with YCP leaders: లండన్ పర్యటన ముగించుకుని ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు ఈరోజు తెల్లవారుఝామున రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర జగన్ కు ఘన స్వాగతం లభించింది. సీఎస్, మంత్రులు, డీజీపీ ఆయనకు స్వాగంత పలికారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆంధ్రాలో పరిస్థితులు చాలా మారాయి. వాటి పరిణామాలు, శాంతి భద్రతల మీద జగన్ ఈరోజు సమీక్ష చేయనున్నారు. దాని తర్వాత వైసీపీ ముఖ్య నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయిన దగ్గర నుంచీ జగన్ రాష్ట్రంలో లేరు. అందుకే ఈరోజు జరగనున్న జగన్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఇందులో ముఖ్యమంత్రి ఏం నిర్ణయాలు తీసుకుంటారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.
పూర్తిగా చదవండి..CM Jagan: చంద్రబాబు అరెస్ట్ మీద ఏపీ సీఏం జగన్ కీలక సమావేశం
లండన్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ దంపతులు రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై జగన్ సమీక్ష చేయనున్నారు. దాంతో పాటూ వైసీపీ ముఖ్యనేతలతో కూడా ఆయన భేటీ అవుతారు. రేపు జగన్ ఢిల్లీ వెళ్ళనున్నారు.

Translate this News:











