CM Jagan Meeting with 8000 YSRCP Leaders: వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ (CM Jagan) రేపు తన పార్టీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. విజయవాడ (Vijayawada) లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఈ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డు చైర్మన్లు, ఎంపీపీలతో సహా ముఖ్య నేతలు (YSRCP Leaders) హాజరుకానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఏపీ నీడ్స్ జగన్ (AP Needs Jagan) క్యాంపెయిన్ ను క్షేత్ర స్థాయిలోకి తీసుకుని వెళ్లేలా శ్రేణులను సమాయత్తం చేయడమే సమావేశ ఎజెండాగా ఉంటుందని ముఖ్య నేతలు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: AP Politics: బండారుపై రోజా సీరియస్ యాక్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి
CM Jagan: రేపు పార్టీ ప్రతినిధులతో సీఎం జగన్ మీటింగ్.. ముందస్తుపై ప్రకటన?
ఏపీ సీఎం జగన్ రేపు విజయవాడలో 8 వేల మంది పార్టీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామా? లేదా? అంశంపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని.. పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Translate this News:











