త్వరలోనే ఢిల్లీ వెళ్లి నడ్డా, అమిత్‌షాను కలిసి ఏపీలోని పరిణామాలను వివరిస్తానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వచ్చే ఏడాది ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటి చేస్తామని పవన్ ప్రకటించిన తర్వాత జనసేన అధినేత తొలిసారి తమ పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. పొత్తు నిర్ణయం ప్రకటించాక ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు పవన్. అటు ఏపీ సీఎం జగన్ టార్గెట్‌గా పవన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని మండిపడ్డారు.
పవన్ హాట్ కామెంట్స్:
Pawan kalyan: జగన్ సంగతి ఢిల్లీలోనే తేలుస్తా..పవన్ మాస్ వార్నింగ్..!
తెలుగుదేశానికి బలం ఉంది.. జనసేనకు పోరాటపటిమ ఉంది.. వైసీపీ పార్టీని కూడా తక్కువ అంచనా వేయకండంటూ తనదైన స్టైల్లో మార్క్ డైలాగులు పేల్చారు పవన్ కల్యాణ్. పొత్తుల కోసం తాను తహతహలాడనని తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు జనసేన అధినేత. త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు రాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తానని చెప్పారు. ప్రధాని, టీడీపీ సపోర్ట్‌తో మనం ముందుకు వెళ్లాటాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు.

Translate this News:











