AP Capital Shifting to Vizag: ఆంధ్ర ప్రభుత్వం విశాఖకు తరలిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దీనికి సంబంధించి విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం (CM Camp Office), మంత్రులకు వసతి కల్పన కోసం ప్రత్యేక కమిటీ వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో (GO) జారీ చేసింది. దీనిలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని సమీక్షించే క్రమంలో ముఖ్యమంత్రి విశాఖలోనే (Vishaka) ఉంటారని స్పష్టం చేశారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు అధికారుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో పట్ణాభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. కమిటీ ఏర్పాటుకు సంబంధించి జీవో 2015ను సీఎస్ జారీ చేశారు. ఇప్పటికే విశాఖలో రెండు రోజులుగా డీజీపీ పర్యటన చేస్తున్నారు. అక్కడ సీఎం కార్యాలయం పనులు పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. నిన్న 6 నూతన జిల్లాల ఎస్పీలతో డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
పూర్తిగా చదవండి..AP Capital Shifting :విశాఖకు రాజధాని…సంచలన జీవో జారీ
విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతి కల్పన కోసం ప్రత్యేక కమిటీ వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని సమీక్షించే క్రమంలో ముఖ్యమంత్రి విశాఖలోనే స్పష్టం చేశారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

Translate this News:











