నారా లోకేష్ కు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో ఏపీ సీఐడీ నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చారు సీఐడీ అధికారులు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నారా లోకేష్ పై ఐసీసీ సెక్షన్ 120(బీ), 409, 420, 34, 35, 36, 37, 166, 167, 217 సెక్షన్లతో పాటు వినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), 13(1)(సీ), 13(1)(డీ) కింద కేసులు నమోదు చేసినట్లు ఏపీ సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబు ఏ1గా, మాజీ మంత్రి నారాయణ ఏ2గా, లింగమనేని రమేష్ ఏ4గా ఉన్నారు. నారా లోకేష్ ను ఈ కేసులో ఏ14గా చేర్చింది సీఐడీ. ఈ నేపథ్యంలో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఏంటి? దాంట్లో లోకేష్ పాత్ర ఏంటని సీఐడీ చెబుతోంది? తదితర వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Big Breaking: నారా లోకేష్ కు సీఐడీ నోటీసులు.. ఈ నెల 4న అరెస్ట్?
Nara Lokesh IRR Case Details: లోకేష్ చేయించిన ఆ ఒక్క మార్పుతో లింగమనేనికి రూ.700 కోట్లు.. హెరిటేజ్ కూ లబ్ధి: సీఐడీ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో నారా లోకేష్ చక్రం తిప్పారని ఏసీ సీఐడీ ఆరోపిస్తోంది. దీంతో లింగమనేని భూముల ధరలు రూ.700 కోట్లు పెరిగాయని చెబుతోంది. ఇంకా నాటి మంత్రి నారయణతో పాటు హెరిటేజ్ సంస్థకు కూడా ప్రయోజనం చేకూరిందని చెబుతోంది.

Translate this News:











