రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు బీఏసీ మావేశం అనంతరం ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభను ఎన్ని రోజులు నడపాలనేదానిపై బీఏసీ సభలో నిర్ణయం తీసునున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశాల్లోరాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ మస్తు బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. దీంతోపాటు విదేశీ విద్యపై ప్రభుత్వం చర్చ జరుపనుంది. వైఎస్ఆర్ ఉచిత పంట బీమా, నామనిర్దేశ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత అంశంపై చర్చించి సభ ఆమోదం తెలపనుంది. దీంతోపాటు రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై సభ్యులు చర్చింనున్నారు. ఇమామ్, మౌజన్, పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచబోతున్నట్లు సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రసంగించనున్నారు. దీంతోపాటు మెగా విత్తన కేంద్రం, గిరిజన సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, వాటివల్ల వారికి కలుగుతున్న ప్రయోజనాలపై సభలొ చర్చించనున్నారు.
పూర్తిగా చదవండి..AP Assembly: రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు బీఏసీ మావేశం అనంతరం ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి.

Translate this News:











