Pravalika News: ఇటీవల నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం (Pravalika Issue) తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వరుసగా ప్రభుత్వ నియామక పరీక్షలు వాయిదా పడడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందంటూ నిరుద్యోగులు భారీగా ఆందోళనలు చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిపక్షాల నేతలు కూడా ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే.. పోలీలు మాత్రం ప్రేమ విఫలం కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తేల్చడం కూడా సంచలనం సృష్టించింది. ఆమె ప్రియుడికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరగడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అందరినీ షాక్ కు గురి చేసింది.
ఇది కూడా చదవండి: Pravalika Suicide: ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు
Pravalika Issue: ప్రవళిక గ్రూప్-1, 2, 3, 4 కు అప్లై చేసింది.. ఇదిగో ప్రూఫ్స్
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ప్రవళిక ఆత్మహత్య ఘటన వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె గ్రూప్-1, 2, 3, 4 తో పాటు DAOకు దరఖాస్తు చేసుకుందని.. అందుకు సంబంధించిన పత్రాలను సోషల్ మీడియాలో వివిధ పార్టీల నాయకులు, నిరుద్యోగులు షేర్ చేస్తున్నారు.

Translate this News:











