హైదరాబాద్ నగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. బోరబండ పీఎస్ పరిధిలో ఇద్దరు పిల్లలను చంపేసి తల్లి జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. బోరబండ డివిజన్ మధురానగర్‌లో శుక్రవార ఉదయం ఈ ఘటన కలకలం సృష్టించింది. నగరానికి చెందిన జ్యోతి, విజయ్ భార్యభర్తతలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జ్యోతి టీజర్‌గా పనిచేస్తోంది. అయితే కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలు అర్జున్ (4), ఆదిత్య (2) విషమిచ్చి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులు గమనించేలోగా జ్యోతి శవం వేలాడుతూ కనిపించగా.. ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. తల్లీపిల్లల మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య, పిల్లల విషయం తెలుసుకున్న భర్త విజయ్ కూడా ఆత్మహత్యాయత్నం ప్రయత్నించాడు. అడ్డుకున్న పోలీసులు, స్థానికులు విజయ్‌ని ఆస్పత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..telangana news: హైదరాబాద్‌లో మరో విషాదం..ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
బోయిన్‌పల్లిలో తండ్రీబిడ్డల ఆత్మహత్య ఘటన మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. బోరబండ పరిధిలోని మధురానగర్‌లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి జ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనకు కారణంగా కుటుంబ కలహాలే అని తెలుస్తోంది.

Translate this News:











