ఇప్పటికే స్కిల్ డవలప్మెంట్ కేసు (Skill Development Case), ఫైబర్ గ్రిడ్, ఐఆర్ఆర్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (Chandrababu Naidu) మరో షాక్ తగిలే అవకాశం ఉంది. 2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు (Cash For Vote) కేసు తాజాగా మళ్ళీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో అక్టోబర్ 4వ తేదీన ఈ ఓటుకు నోటు కేసు లిస్టయింది. ఈ కేసుకు సంబంధించి 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు.
ఇది కూడా చదవండి: Chandrababu: దీక్షకు సిద్దమైన చంద్రబాబు.. ఎప్పుడంటే.!
Cash For Vote Case: చంద్రబాబుకు ఊహించని షాక్.. తెరపైకి ఓటుకు నోటు కేసు..
ఇప్పటికే స్కిల్ డవలప్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్, ఐఆర్ఆర్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబుకు మరో షాక్ తగిలే అవకాశం ఏర్పడింది. ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో అక్టోబర్ 4వ తేదీన ఈ ఓటుకు నోటు కేసు లిస్టయింది.

Translate this News:











