ఎన్నికల కమిషన్ తెలంగాణలో భారీగా అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం వెనుక బీజేపీ హస్తం ఉండొచ్చని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆర్టీవీ అన్ సెన్సార్డ్ ఇంటర్వ్యూకు (RTV UNCENSORED Interview) ఆయన హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో ఆర్టీవీ ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. అధికారులను మార్చినంత మాత్రాన ఎన్నికలు తారుమారు అయ్యే అవకాశం ఉండదన్నారు. మరో సారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014కి ముందు తెలంగాణ.. 2014 తర్వాత తెలంగాణ ఎలా ఉంది అన్న అంశం ట్రెండింగ్ లో ఉందన్నారు. ఏ గ్రామంలోకి వెళ్లినా.. ప్రజలు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారన్నారు. మళ్లీ కేసీఆర్ గెలిస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు.
పూర్తిగా చదవండి..MLA Kranthi UNCENSORED Interview: అధికారుల బదిలీ వెనుక బీజేపీ హస్తం.. భూకబ్జా ఆరోపణలు అవాస్తవం.. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఎక్స్ క్లూజీవ్

Translate this News:











