గుండె నిండా ధైర్యం ఉప్పొంగింది. ఎలాగైనా బతకాలనే ఆశ ఆమెలోని సమయస్ఫూర్తిని బయటకు తీసేలా చేసింది. కళ్లముందే తల్లి, చెల్లి మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నా.. తండ్రి లాగా భావించిన వ్యక్తే యముడై తనను కాటికి పంపాలనుకున్నా.. ఆ బాలిక మాత్రం వణకలేదు. చుట్టూ అంధకరమే అలుముకున్నా.. కను చూపు మేరలో సాయం చేసే నాథుడే కనపడకున్నా ఆమె బెదరలేదు. బతకాడానికి కావాల్సింది డబ్బు కాదని.. ధైర్యముంటే మృత్యువుని కూడా జయించవచ్చని నిరూపించిందామె. చిన్నచిన్న సమస్యలకే ఊపిరి వదులుతున్న వారికి స్ఫూర్తి నింపేలా ఆ బాలిక చూపించిన ధైర్యం, సమయస్ఫూర్తి యావత్ దేశ ప్రజలను సలామ్ కొట్టేలా చేసింది. ఇప్పుడా బాలిక టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ కాదు.. టాక్ ఆఫ్ ది కంట్రీ..! అవును..! మన రాపులపాలెంలో జరిగిన ఓ ఘటనను హిందీ మీడియా కూడా హైలెట్ చేస్తుందంటే ఆ బాలిక ఏం చేసిందో మీరంతా తెలుసుకోవాల్సిందే!
తండ్రి అనుకుంటే..!
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పుప్పాల సుహాసిని(36) భర్తతో గొడవల కారణంగా విడిపోయి దూరంగా ఉంటోంది. కూలి పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తోంది. ఆమెకు కిర్తన అనే పాప కూడా ఉంది. ప్రస్తుతం కీర్తన 13ఏళ్ల బాలిక. ఇక భర్తతో విభేదాలు పెరగడంతో విడాకులు తీసుకున్న సుహాసినికి రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేశ్(30)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త సహజీవనానికి దారి తీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సుహాసిని(suhasini), సురేశ్(suresh) పిల్లలతో కలిసి ఉంటున్నారు. సురేశ్‌తో సహజీవనం కారణంగా వీరిద్దరికి జెర్సీ (1) జన్మించింది. ఇప్పటివరకు అంతాబాగానే ఉన్నా ఇంతలోనే సురేశ్ తన రియాల్టిని బయటకు తీశాడు. ఎలాగైనా సుహాసినిని వదలించుకోవాలనుకున్నాడు. తరుచుగా సుహాసినితో గొడవ పడడం మొదలుపెట్టాడు. అయినా ఆమె సురేశ్‌ని వదలలేదు.
బ్రిడ్జ్ పైపు పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న సాహస బాలిక
తనతో సహజీవనం చేసిన మహిళతో పాటు ఆమె కుటుంబాన్ని నదిలోకి తోసేశాడు ఓ కిరాతకుడు. భర్తతో గొడవల కారణంగా విడిపోయి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోన్న సుహాసిని(36)జీవితంలోకి రెండేళ్ల క్రితం ప్రవేశించిన సురేశ్(30) మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. తాడేపల్లిలో నివాసముంటున్న ఈ ఇద్దరికి ఏడాది క్రితం ఓ పాప (జెర్సీ) కూడా జన్మించింది. అయితే ఎలాగైనా ఈ కుటుంబాన్ని వదిలించుకోవాలనుకున్న సురేశ్ సుహాసిని కుటుంబాన్ని షాపింగ్ పేరుతో రాజమండ్రి తీసుకెళ్లాడు..రాత్రంతా గడిపిన తర్వాత తెల్లవారుజామున 4గంటల సమయంలో వారందరిని గౌతమి పాత వంతెన దగ్గరకు తీసుకెళ్లి రెయిలింగ్ నుంచి తోసేశాడు. ఈ ప్రమాదంలో సుహాసిని, జెర్సీ నదిలో గల్లంతవగా.. కుమార్తే కీర్తన రెయిలింగ్‌కి అనుకోని ఉన్న పైపును పట్టుకోని ప్రాణాలు కాపాడుకుంది.

Translate this News:













