తిరుపతిలో ఓ బాలుడు కిడ్నాప్ కు గురైన ఘటన కలకలం రేపుతోంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్‌లో అర్థరాత్రి రెండేళ్ల బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటన నిన్న రాత్రి రెండు గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం శ్రీవారి దర్శనానికి చెన్నైకి చెందిన చంద్రశేఖర్-మీనా దంపతులు తమ రెండో కుమారుడు మురుగేశన్ తో కలిసి వచ్చారు. అయితే.. అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో ఆ బాలుగు కిడ్నాప్ కు గురైనట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ వయస్సు సుమారు32 సంవత్సరాలు ఉండవచ్చు అని పోలీసులు వెల్లడించారు. కిడ్నాపర్ వైట్ షూ, గ్రీన్ కలర్ షర్ట్‌తో వేసుకుని ఉన్నాడని తెలిపారు. రిజర్వేషన్ కౌంటర్ నుంచి బాలుడ్ని బస్టాండ్ బయట గల అంబేద్కర్ విగ్రహం వైపు ఆ కిడ్నాపర్ తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..Tirupati: తిరుపతిలో కిడ్నాప్ కలకలం. ఎలా జరిగిందే..?
తిరుమల అంటేనే ఒక్కసారిగా ఒళ్ళు జలకరించాల్సిందే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే శ్రీవారి భక్తులకు వణికిపోవాల్సిందే. తిరుమలలో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఈమధ్య చిరుతలు, ఎలుగుబంట్లు, ప్రాణపోయిన సందర్భాలను చూశాం. తిరుమలకు వెళ్తే.. ప్రాణాలతో తిరిగి వస్తామా..!! అనే భయం శ్రీవారి భక్తులకు వస్తోంది. తాజాగా మరో ఘటనతో తిరుమలలో కలకలం రేపుతోంది.

Translate this News:











