Andhra Pradesh: తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పున్నమి చంద్రుడు అని, ఆయన్ను వైసీపీ(YCP) ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించిందని ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేని నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ఇన్ని రోజులు జైల్లో ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క ఆధారమైనా సాధించారా? అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించారు అచ్నెన్నాడు. తెలుగుదేశం పార్టీ కోసం వచ్చిన విరాళాలు, నిధులు విషయంలో ఛాలెంజ్ చేశామన్నారు. టీడీపీకి వచ్చిన ప్రతి పైసాకి లెక్కలు ఉన్నాయని, కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇస్తామన్నారు. వైసీపీ నిన్న, మొన్న పుట్టిన పార్టీ అని, అలాంటి పార్టీకి వందల కోట్లు ఫండ్స్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. వాటి గురించి చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: పున్నమి చంద్రుడు చంద్రబాబు.. వైసీపీపై నిప్పులు చెరిగిన అచ్చెన్నాయుడు..
తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పున్నమి చంద్రుడు అని, ఆయన్ను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించిందని ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేని నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ఇన్ని రోజులు జైల్లో ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క ఆధారమైనా సాధించారా? అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించారు అచ్నెన్నాడు.

Translate this News:











