Andhra Pradesh Assembly 2nd Day: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ(TDP) నేతల నిరసనలతో ఏపీ అసెంబ్లీ(AP Assembly) దద్దరిల్లిపోతోంది. చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమ కేసులను కొట్టివేయాలని, ఆయన్ని విడుదల చేయాలంటూ సభా వేదికగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. అయితే, ఈ క్రమంలో అధికార పార్టీ సభ్యులు, టీడీపీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ నేతల ఆందోళనపై కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. ప్రాపర్ ఫార్మెట్ లో వస్తే అసెంబ్లీలో చర్చించడానికి సిద్దంగా వున్నామని స్పష్టం చేశారు మంత్రి. చర్చలో పాల్గొనాలని, పారిపోవద్దంటూ టీడీపీ నేతలకు చురకలంటించారు.
పూర్తిగా చదవండి..AP Assembly: బాలయ్యకు ఇది మంచి ఛాన్స్.. పార్టీని టేకోవర్ చేసుకొండంటూ అంబటి సూచన..
బాలకృష్ణ గతంలో ఏనాడూ ఇంత యాక్టీవ్‌గా లేరని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. మీసం మీ పార్టిలో తిప్పండి.. శాసనసభలో కాదు అంటూ బాలయ్యకు సూచించారు మంత్రి అంబటి.

Translate this News:











