ఏపీలో కొత్త సబ్ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్ విడుదల..!
ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సబ్ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ ఉప జిల్లాల్లో (సబ్ డిస్ట్రిక్ట్స్) జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లు ఏర్పాటవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉప జిల్లాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.












