CM YS Jagan Tirumal Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM YS Jagan) ఇవాళ(సోమవారం) తిరుపతి(Tirupati)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సీఎం జగన్. సోమవారం మద్యాహ్నం 3 గంటలకు తాడెపల్లి నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 3.50 గంటలకు తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడే టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, ఉద్యోగులకు ఇంటి స్థలాలకు సంబంధించిన డాక్యూమెంట్స్ని అందిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోనున్నారు సీఎం జగన్. అనంతరం నేరుగా తిరుమలకు పయనమవుతారు. సాయత్రం 5.40 గంటలకు తిరుమలలో వకుళమాత రెస్ట్ హౌస్ ప్రారంభిస్తారు సీఎం జగన్. అక్కడి నుంచి పద్మావతి అతిధి గృహం చేరుకుని రాత్రి 7:45 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకువస్తారు సీఎం జగన్. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేష వాహన సేవలో పాల్గొని రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. మరుసటి రోజు తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: నేడు తిరుమలకు సీఎం జగన్.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సీఎం జగన్. సోమవారం మద్యాహ్నం 3 గంటలకు తాడెపల్లి నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.

Translate this News:











