ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆగష్టు 15 వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి.. వందనం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మన జెండా.. 140 కోట్ల మంది భారతీయుల గుండె. ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి గుర్తు. మన పూర్వీకుల త్యాగానికి గుర్తు. ఈ జెండా నిరంతరం మనకు స్ఫూర్తిని ఇస్తోందన్నారు జగన్. ఈ జెండాకి సెల్యూట్ చేస్తున్నా అన్నారు. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో.. 76 ఏళ్లలో ఎంతో ప్రగతి కనిపించిందన్నారు. సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం సాధ్యమైందన్నారు. గ్రామాల అభివృద్ధికి 50 నెలల్లో ఏన్నో చేశామన్నారు.
పూర్తిగా చదవండి..Independence Day 2023: ఏపీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగరేసిన ముఖ్యమంత్రి జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగష్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో జాతీయ జెండాను ఎగురవేసి.. వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు పంట బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నామన్నారు. అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు అండగా నిలుస్తాన్నమన్నారు.

Translate this News:











