AP Cabinet Meet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రేపు(సెప్టెంబర్ 20) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గుంటూరులోని వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రానున్న అసెంబ్లీ సమావేశాలతోపాటు కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. సెప్టెంబర్ 21 నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర శాసనసభ సమావేశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులు పొడిగించే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ఆర్డినెన్స్‌లపై కొన్ని బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..AP Cabinet: చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలి కేబినెట్ భేటీ.. జగన్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలోనే రేపు(సెప్టెంబర్ 20) ఏపీ కేబినెట్ భేటి కానుంది. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ఆర్డినెన్స్‌లపై కొన్ని బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

Translate this News:











