Andhra Pradesh Assembly Session: ఆంధ్రప్రదేశ్ మూడవ రోజు శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్‌తో సభ ప్రారంభం కానుంది. ఇవాళ శాసనసభలో(Assembly) ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. సభలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, ఏపీపీఎస్సీ అదనపు విధుల సవరణ బిల్లులను ప్రభుత్వం ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టనుంది. అలాగే బుడగ జంగాల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం చేయనుంది. ఇవాళ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి.. కేంద్రానికి పంపనుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చిన నేపథ్యంలో.. అసెంబ్లీలో మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం.
పూర్తిగా చదవండి..AP Assembly: మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశం.. కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న సర్కార్..
ఆంధ్రప్రదేశ్ మూడవ రోజు శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్‌తో సభ ప్రారంభం కానుంది. ఇవాళ శాసనసభలో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. సభలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, ఏపీపీఎస్సీ అదనపు విధుల సవరణ బిల్లులను ప్రభుత్వం ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టనుంది.

Translate this News:











