Andhra Pradesh Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి జరగనున్నాయి. మొత్తం ఆరు రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో జగన్ సర్కార్ తర్వాతి స్టెప్ ఏంటన్నది ఆసక్తిగా మారింది.
ఢిల్లీకి జగన్:
రాష్ట్రంలో ప్రస్తుత వ్యవహారాలు, శాంతిభద్రతలను అంచనా వేయడానికి సీఎం జగన్ (CM Jagan) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అంచనా. వైసీపీ ఎమ్మెల్యేలతో చర్చించి వచ్చే వారం క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలోనే జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు (సెప్టెంబర్ 13) సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారనీ ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాని కలవబోతున్నారని సమాచారం. జగన్ ఢిల్లీలో రెండు రోజులు ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలపై కేంద్రంతో చర్చిస్తారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ ఢిల్లీ పర్యటనను పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి.
Breaking: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రేపు ఢిల్లీకి జగన్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి జరగనున్నాయి. మొత్తం ఆరు రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో జగన్ సర్కార్ తర్వాతి స్టెప్ ఏంటన్నది ఆసక్తిగా మారింది.

Translate this News:











