పవన్ చెప్తే కాపులు టీడీపీకి ఎందుకు ఓట్లు వెయ్యాలని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుపైనా విమర్శలు గుప్పించారు. కాపులు టీడీపీకి ఎందుకు వెయ్యాలో పవన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాపుల కోసం ఉద్యమం చేస్తే పవన్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని నిలదీశారు. దొంగ పని చేసిన బాబుకి పవన్ ఎందుకు అండగా నిలబడుతున్నాడన్నారు అమర్నాథ్. రంగా మరణానికి కారణమైన చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు.
పూర్తిగా చదవండి..Gudivada amarnath: ‘రంగా మరణానికి కారణమైన చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు’? గుడివాడ అమర్నాథ్ ఫైర్
జనసైనికులు జెండా కూలీలని.. జనసేన పార్టీ ఎందుకని.. టీడీపీలో విలీనం చేస్తే మంచిదంటూ పవన్‌కల్యాణ్‌కి చురకలంటించారు మంత్రి అమర్నాథ్. రంగా మరణానికి కారణమైన చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని పవన్‌పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎంతమందిని చంపావ్.. ఎంతమందిని ఇబ్బంది పెట్టావ్ అని ప్రశ్నించారు అమర్నాథ్. ముద్రగడను కూడా చంద్రబాబు చంపాలని చూశాడని ఆరోపించారు.

Translate this News:











