Anantapur : అనంతపురం జిల్లా కేంద్రీయ విద్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుంది. విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ లైబ్రరీయన్పై దాడి చేశారు తల్లిదండ్రులు. గత కొన్ని రోజులుగా విద్యార్థులను వేధిస్తున్నారని పిల్లలు ఆరోపణ చేయటంతో.. ఇవాళ పాఠశాల వద్దకు చేరుకొని లైబ్రరీయన్‌కు దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. గతంలో ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వారు ఆరోపించారు. అయితే పిల్లల్ని నేను కొట్టలేదని లైబ్రరీయన్ అంటున్నారు. రంగలోకి దిగిన పోలీసులు అక్కడ విద్యార్థుల తల్లిదండ్రలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కొద్ది సేపు టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఇలాంటి వారిని ఉద్యోగం లోనుంచి తీసివేయాలని వారు డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..Anantapur: విద్యార్థినుల్ని వేధించిన టైబ్రేరియన్కు దేహశుద్ధి
పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్‌కు తల్లిదండ్రులకు దేహశుద్ది చేశారు. పిల్లలను లోదుస్తుల కలర్ గురించి ఆడుగుతూ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించారని టైబ్రేరియన్పై ఆరోపణ చేశారు. ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు లైబ్రేరియన్‌ను చితకబాదిన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Translate this News:











