Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్ మార్పు కేసులో (Inner Ring Road Case) అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్ ను ఛాలెంజ్ చేస్తూ ఆయన తరుపు లాయర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద హైకోర్టులో రేపు విచారణ జరగవచ్చని తెలుస్తోంది. రాజధాని కేసులో A1 గా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు.ఇన్నర్ రింగ్ రోడ్డు A1గా ఉన్న చంద్రబాబు,A2 మాజీ మంత్రి నారాయణ, A3 గా ఉన్న లింగమనేని రమేష్, A4 గా లింగమనేని రాజశేఖర్, A5 రామకృష్ణ హోసింగ్ డైరెక్టర్ అంజనీ కుమార్, A6 గా నారా లోకేష్ (Nara Lokesh) లు ఉన్నారు. మరోవైపు టీడీపీ (TDP) పాలన టైమ్ లో అయిన కుంభకోణాల మీద సీఐడీ (CID) సిట్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అందుకే బాబు తరుఫు న్యాయవాదులు వెంటనే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారని సమాచారం.
పూర్తిగా చదవండి..Chandrababu:ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు లాయర్లు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైనమెంట్ మార్పు కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరఫున లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

Translate this News:











