ఈరోజు సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. బీజేపీ ఇచ్చిన మాట తప్పదని స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. రూ.50వేల కోట్లతో దళితుల అభివృద్ధి నిధి ఏమైందో చెప్పాలంటూ ప్రశ్నించారు. రూ.10 వేల కోట్లతో బీసీ సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి వారి సంక్షేమాన్ని కేసీఆర్ ఎందుకు గాలికొదిలేశారంటూ నిలదీశారు. బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పార్టీలని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం సోనియా గాంధీ లక్ష్యమని.. అలాగే కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం కేసీఆర్ లక్ష్యమని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Telangana: అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం: అమిత్ షా
రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ రోజు సూర్యాపేటలో జరిగిన బీజేపీ సభలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ ఇచ్చిన మాట తప్పదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

Translate this News:











