ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ ప్రచారాన్ని ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. బూత్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తూ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ఇక్కడ తన ప్రసంగంలో మిస్టర్ బంటాధర్, కరప్షన్ నాథ్ వంటి పేర్లను పదేపదే ఉపయోగిస్తూ గత కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ను డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అమిత్ షా అన్నారు. ఇండోర్‌లో బిజెపి విజయ్ సంకల్ప్ సమ్మేళన్ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, గత కమల్‌నాథ్ ప్రభుత్వంలో కేవలం ఒకటిన్నర సంవత్సరాలలో, 18,000 మందికి పైగా క్లాస్-1 అధికారులను బదిలీ చేశారు. కేవలం ఒక పరిశ్రమ మాత్రమే వారి సహాయంతో ప్రారంభించింది. ఇది మిస్టర్ బంటదార్ పాలనను ప్రజలకు గుర్తు చేసిందంటూ ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..‘మిస్టర్ బంటాధర్ అండ్ కరప్షన్ నాథ్ వినండి’ అంటూ ఇండోర్‌లో కాంగ్రెస్‌పై విరుచుకుపడిన అమిత్ షా..!!
గత 70ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేసిందేమీ లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాని నరేంద్రమోదీ పేదలకు సంక్షేమ పథకాలతో వారికి మెస్సయ్యగా అనిపించుకుంటున్నారన్నారు. 70 ఏళ్ల పాటు ఆర్టికల్ 370ని కాంగ్రెస్ తన బిడ్డలా తన ఒడిలో పెట్టుకుందని, అయితే ప్రధాని మోదీ దానిని తొలగించి కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశారని అమిత్ షా అన్నారు.

Translate this News:











