టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ ను ఇచ్చింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 24న బాబు తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. దాంతో పాటు బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని స్పష్టం చేసింది. ఫోన్లో కూడా మాట్లాడకూడదంటూ ఆదేశాల్లో పేర్కంది న్యాయస్థానం. అలాగే మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని ఈ సందర్భంగా హైకోటర్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..నిజం గెలిచి కాదు.. కళ్లు కనిపించడం లేదనే బాబుకు బెయిల్.. అంబటి సెటైర్లు
చంద్రబాబుకు బెయిల్ రావడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్లు కనిపించట్లేదని బెయిల్ ఇచ్చారని సెటైర్లు వేశారు.

Translate this News:











