Amaravati Assigned Lands case: అమరావతి అసైన్డ్ భూముల కేసును ఏపీ హైకోర్టు (AP High Court) నవంబర్ 1కి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. కానీ కొత్త ఆధారాలు పరిగణలోకి తీసుకుని విచారించాలంటూ సీఐడీ (AP CID) కోర్టులో పిటిషన్ వేసింది. సీఐడీ అధికారులు వేసిన పిటిషన్లను స్వీకరించిన కోర్టు ఈరోజు విచారణ చేసింది. అసైన్డ్ ల్యాండ్ కేసులో సీఐడీ అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను పరిశీలించింది.కేసు రీఓపెన్ చేసేందుకు ఏమైనా అభ్యంతరాలుంటే కౌంటర్ దాఖలు ప్రతివాదులకు సూచించింది. హైకోర్టుకు సీఐడి తరపున న్యాయవాదులుఆడియో ఫైల్స్ ను అందించారు. రేపు మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందిస్తామని చెప్పారు. దీంతో ఉన్నత న్యాయస్థానంతదుపరి విచారణ వచ్చే నెల ఒకటో తేదీకి వాయిదా వేసింది.
పూర్తిగా చదవండి..AP High Court: అమరావతి అసైన్డ్ భూముల కేసు వాయిదా
అమరావతి అసైన్డ్ భూముల కేసుకు సంబంధించి హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈకేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు అందిస్తామని సీఐడీ చెప్పడంతో కోర్టు ఈ విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.

Translate this News:











