Allu Arjun Comments Viral in Social Media: ‘పుష్ప’ మూవీకి జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పురస్కారాలు అందుకున్న సంగతి తెలిసిందే. అటు, ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా జాతీయ అవార్డులు లభించాయి. ఈ నేపథ్యంలో, నేషనల్ అవార్డు విన్నర్స్ కు మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ సంస్థ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి హాజరైన అల్లు అర్జున్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..పోరంబోకులం..ప్రెసిడెంట్ మెడల్ అందుకుంటామని అనుకోలేదు..!
'ప్రిన్సిపాల్ నుంచి సర్టిఫికెట్లు కూడా తీసుకోని ఇద్దరం పోరంబోకులం ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నాం' అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. 'పుష్ప' చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డ్స్ అందుకోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్గా పార్టీ ఇచ్చారు. ఈ ఈవెంట్ లో బన్నీ చేసిన కామెంట్స్ నెట్టంట్లో వైరల్గా మారాయి.

Translate this News:












