కొందరు భక్తులు తమ ఇష్ట దైవం కోసం కానుకులు ఇస్తూ ఉంటారు. ఎవరి స్థాయికి తగ్గట్లు వారు కానుకలు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. డబ్బులు ఉన్న వారు అయితే బంగారు ఆభరణాలు ఆలయ ధర్మకర్తలకు సమర్పిస్తుండటం వింటూనే ఉంటాం. కానీ యూపీలోని అలీఘర్కు చెందిన సత్యప్రకాశ్ శర్మ అనే రామ భక్తుడు వినూత్నంగా ఆలోచించాడు. తాళాలు చేసే వృత్తిలో ఉన్న శర్మ అనే వృద్ధుడు త్వరలో ప్రారంభంకానున్న అయోధ్య రామమందిరానికి కానుకగా ఇవ్బడం కోసం 400కేజీల బరువున్న భారీ తాళం తయారుచేశాడు. దీని తయారీ కోసం రూ.2లక్షలు ఖర్చుచేశారు. మొత్తం పని పూర్తి కావడానికి మరో రూ.3లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. త్వరలోనే ఆయల అధికారులకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.
పూర్తిగా చదవండి..అయోధ్య రాములోరికి కానుకగా 400కేజీల భారీ తాళం
దశాబ్దాలుగా హిందువులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే రానుంది. ఎన్నో వివాదాలు, మరెన్నో ఆటంకులు దాటుకుని అయోధ్యలో రాములోరి ఆలయం రెడీ అవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంంలో ఎంతో వైభవంగా రామమందిరం ప్రారంభంకానుంది.

Translate this News:











